iTDP Nellore Rural Cluster 02

iTDP Nellore Rural Cluster 02 KGR యువసేన చింతారెడ్డిపాళెం
సోషల్ మీడియా నెల్లూరు రూరల్

06/06/2026

కోటంరెడ్డి బ్రదర్స్ సైన్యం నెల్లూరు రూరల్

*SIRతో ఓటరు జాబితాలో సమూల మార్పులు.**సమష్టి కృషితో తప్పులు లేని సమగ్ర ఓటరు జాబితాలు తయారు చేద్దాం.* *అర్హులైన ప్రతి ఒక్క...
06/06/2026

*SIRతో ఓటరు జాబితాలో సమూల మార్పులు.*
*సమష్టి కృషితో తప్పులు లేని సమగ్ర ఓటరు జాబితాలు తయారు చేద్దాం.*
*అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు కావాలి.*
*టీడీపీ బీఎల్ఏలు SIRలో ఉత్సాహంగా పాల్గొనాలి.*
-------------------------

🔶నేడు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా పున:పరిశీలన SIR పై తెలుగుదేశం పార్టీ బూత్ లెవల్ ఏజెంట్లు, తెలుగుదేశం పార్టీ నాయకులతో అవగాహన సమావేశం నిర్వహించిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.

🔶బీఎల్ఏలకు SIR కార్యక్రమంలో చేపట్టవలసిన కార్యాచరణపై కీలక సూచనలు చేసిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.

🔶ఓటరు జాబితాల రివిజన్ ప్రక్రియ 24 ఏళ్ల తర్వాత ఎలక్షన్ కమిషన్ చేపట్టింది. కావున ప్రతి ఒక్క బి.ఎల్.ఏ. మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు SIR కార్యక్రమంలో భాగస్వాములై కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.

🔶జూన్ 15 నుంచి జూలై 14వ తేదీ వరకు బీఎల్ఓలు ఇంటింటికీ వచ్చి ఓటర్ల వివరాలు సేకరిస్తారు. జూలై 14న పోలింగ్ స్టేషన్ల పునర్ వ్యవస్థీకరణ చేపడుతారు. జూలై 21వ తేదీ నాటికి ముసాయిదా ఓటరు జాబితాలు ప్రచురిస్తారు.తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.

🔶ఆగస్టు 20వ తేదీ వరకు అభ్యంతరాలను స్వీకరిస్తారు. సెప్టెంబర్ 18వ తేదీ లోపు అభ్యంతరాలను పరిష్కరించి 22వ తేదీన తుది జాబితాలు ప్రకటిస్తారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.

🔶కొత్తగా ఓటు నమోదు, తప్పుల సవరణ, ఓట్ల తొలగింపునకు కూడా అవకాశం కల్పిస్తారు. SIR తర్వాత ఒక్కో నియోజకవర్గంలో వేలాది చేల్లని ఓట్లు తగ్గిపోయే అవకాశం ఉంది.తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.

🔶బీఎల్ఓలతో కలిసి జాబితాలను పరిశీలించడంలో బీఎల్ఏలు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.

పై కార్యక్రమంలో క్లస్టర్ ఇంచార్జీలు, కో క్లస్టర్ ఇంచార్జ్ లు, కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, తెలుగుదేశం పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులు, మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

*లైన్ మెన్ల సేవలు అమోఘం. సమాజంలో లైన్ మెన్ల పాత్ర చాలా కీలకం.* *లైన్ మెన్ల గౌరవం పెంచేవిధంగా పనిచేస్తాం.* --------------...
06/06/2026

*లైన్ మెన్ల సేవలు అమోఘం. సమాజంలో లైన్ మెన్ల పాత్ర చాలా కీలకం.*
*లైన్ మెన్ల గౌరవం పెంచేవిధంగా పనిచేస్తాం.*
-----------------------------

🔶 నేడు నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని విద్యుత్ భవన్ లో సబ్ డివిజినల్ భవనాన్ని రిటైర్డ్ లైన్ మెన్ పద్మనాభయ్య చేతులమీదుగా ప్రారంభింపచేసిన రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, విద్యుత్ శాఖ ఎస్.ఈ. రాఘవేంద్రం మరియు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.

🔶 కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రెండు సంవత్సరాలలో ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మెరుగైన కరెంటు సేవలు ప్రజలకు అందించేందుకు నెల్లూరు రూరల్ లో అనేక కార్యక్రమాలు చేపట్టి పూర్తిచేశాం. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

🔶 అదనంగా సబ్ స్టేషన్ ల నిర్మాణాలకు అన్నిరకాల ప్రయత్నాలు చేస్తున్నాం. విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ గారి సహాయ సహకారాలతో నెల్లూరు రూరల్ లో మెరుగైన కరెంటు ను ప్రజలకు అందించేందుకు స్థానిక శాసనసభ్యుడిగా నిరంతరం పనిచేస్తా. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

పై కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ భీమినేని మురహరి, బీజేపీ నాయకులు విజయ్ కుమార్, జనసేన నాయకులు సుందరరామిరెడ్డి, ఉదయ్, టీడీపీ నాయకులు ఉప్పు భాస్కర్, రమణయ్య నాయుడు, అలహరి విజయ్, కుమార్, సాజిద్, ప్రణీత్, కుమార్, భరత్ తదితరులు పాల్గొన్నారు.

*ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని రూరల్ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి.**ప్రజా సమస్యల పరిష్కారమే మా లక్ష్యం.*....................
05/06/2026

*ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని రూరల్ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి.*
*ప్రజా సమస్యల పరిష్కారమే మా లక్ష్యం.*....................................
🔶నేటి ఉదయం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో ప్రజాదర్బార్ కార్యక్రమం పాల్గొన్న నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.

🔶ప్రతి రోజు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో నెల్లూరు రూరల్ ప్రజలకు ఉదయం 7గంటల నుండి రాత్రి 8 గంటల వరకు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటున్నాము.రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

🔶రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ గార్ల ఆదేశాల మేరకు ప్రతి శుక్రవారం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రజాదర్బార్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది, కావున ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము.రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.

పై కార్యక్రమంలో నగర మాజీ మేయర్ నందిమండలం భాను శ్రీ, క్లస్టర్ ఇంచార్జ్ లు సాబీర్ ఖాన్, కనుపర్తి గంగాధర్, నెల్లూరు రూరల్ నియోజకవర్గ టిడిపి తెలుగు యువత అధ్యక్షుడు నందిపాటి శ్యామ్, టిడిపి నాయకులు శశిధర్, మేఘనాథ్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.

*అంతర్జాతీయ పర్యావరణ పరిరక్షణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మరియు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు న...
05/06/2026

*అంతర్జాతీయ పర్యావరణ పరిరక్షణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మరియు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలు మేరకు ఎలక్ట్రికల్ స్కూటీ పై శంకుస్థాపన కార్యక్రమానికి వెళ్లిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.*
*30వ డివిజన్ వై.ఎస్.ఆర్. నగర్ లో స్థానిక ప్రజలతో కలసి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.*
-------------------------------

🔸 నేటి ఉదయం నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 30వ డివిజన్ వై.ఎస్.ఆర్.నగర్ లో 4కోట్ల 80 లక్షల రూపాయలతో 1200 కిలో లీటర్ల కెపాసిటీ గల వాటర్ ట్యాంక్ మరియు 9.50 కిలో మీటర్ల పైప్ లైన్ పనులకు స్థానిక ప్రజలతో కలసి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.

🔸 కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత నెల్లూరు రూరల్ లో జరుగుతున్న, పూర్తైన, టెండర్లు పిలిచిన అభివృద్ధి పనుల విలువ సుమారు 700 కోట్ల రూపాయలు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.

🔸 కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటినుండి 30వ డివిజన్ లో 10 కోట్ల 15 లక్షల రూపాయలతో పలు అభివృద్ధి పనులు చేసాము. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.

🔸 భారతదేశానికి ఎలాంటి ఇబ్బంది రాకుండా ఉండాలని ప్రధానమంత్రి మోడీ గారి సూచనలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.

🔸 నా దేశం - నా బాధ్యత అనే నినాదం దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరూ ఇంధన వినియోగం వీలైనంత వరకు తగ్గించుకొని పర్యావరణానికి మేలు చేయడంలో బాగస్వామ్యులవుదాం. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.

🔶 ఇంత మంచి చేస్తున్న కూటమి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి మీ అందరి ఆశీస్సులు ఎల్లప్పుడు ఉండాలి. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.

పై కార్యక్రమంలో క్లస్టర్ ఇంచార్జులు,కో క్లస్టర్ ఇంచార్జులు,కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, అనుబంధసంఘాల అధ్యక్షులు, కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Address

CHINTHAREDDYPALEM
Nellore

Telephone

+918297490039

Website

Alerts

Be the first to know and let us send you an email when iTDP Nellore Rural Cluster 02 posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to iTDP Nellore Rural Cluster 02:

Share

Category