05/08/2023
*చంద్రబాబుపై దాడి అప్రజాస్వామికం......*
*చంద్రబాబు ప్రజాధరణ చూసి వైకాపా నాయకుల గుండెల్లో గుబులు...*
రాష్ట్రంలో అరాచక,రాక్షస పాలన సాగుతుంది అని అనడానికి ఉదాహరణ నేడు పుంగనూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పై జరిగిన ఘటన అని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు అన్నారు.నేడు పుంగనూరు నియోజకవర్గంలో పెద్దిరెడ్డి తన అనుచరులతో చంద్రబాబు నాయుడుపై చేసిన దాడిని ఖండిస్తూ వారి నివాసము నందు ఎమ్మెల్యే గోరంట్ల పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు.
ఆ సందర్భంగా గోరంట్ల మాట్లాడుతూ వైకాపా నాయకులు ఆంధ్రరాష్ట్రం వాళ్ళ జాగిర్దారు అనుకుంటున్నారని,రాష్ట్రంలో విచ్చలవిడిగా ఏమైనా చేయొచ్చు అనుకుంటున్నారని,ఈ ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల పట్ల సమస్యల పట్ల ప్రశ్నిస్తే జగన్మోహన్ రెడ్డి తన పేటీఎం బ్యాచ్ ని దింపి దాడి చేస్తారని గోరంట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్దిరెడ్డి రాష్ట్రంలో మైనింగ్ మాఫియా కింగ్ అని రాష్ట్రంలో ఉన్న ఇసుకను,మట్టిని పెద్దిరెడ్డి తన అనుచరులతో మాఫియా సాగిస్తున్నాడని, పుంగనూరు పెద్దిరెడ్డి జాగిద్దరా అక్కడ వేరే నాయకులు అడుగు పెట్టకూడదా అని గోరంట్ల ప్రశ్నించారు.
పరదాలు చాటున తిరిగే ఈ ముఖ్యమంత్రి పోలీసులు లేకుండా ధైర్యంగా బయటికి వచ్చే దమ్ముందా అని, అంతేకాకుండా పోలీస్ వ్యవస్థతో ప్రజాస్వామ్యాన్ని అణిచివేయాలని జగన్ చూస్తున్నారని అది వారి తరం కాదని,న్యాయాన్ని కాపాడవలసిన పోలీసులు వైకాపా నాయకులు చెప్పినట్లు ఆడుతున్నారని,అన్యాయంగా తెలుగుదేశం పార్టీ నాయకుల పై, కార్యకర్తలపై తప్పుడు కేసులు బనాయించి వారిని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని,ఈ ప్రభుత్వం ఇంకా నాలుగు నెలలే మాత్రం ఉంటుందని తరువాత అధికారంలోకి రాబోయేది తెలుగుదేశం పార్టీ అని దానిని పోలీస్ వ్యవస్థ తెలుసుకోవాలని గోరంట్ల అన్నారు.రాష్ట్రంలో ప్రజా సంక్షేమాన్ని,అభివృద్ధిని గాలికి వదిలేసి రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా చేశారని,యువతకు ఉపాధి లేక, పెట్టుబడులు,పరిశ్రమలు రాక, నేడు యువత వేరే రాష్ట్రాలకు వలస పోతున్నారని, రాష్ట్రంలో ఉన్న నీటి ప్రాజెక్టులను చంద్రబాబు నాయుడు సందర్శిస్తే జగన్ గుండెల్లో వణుకు పుడుతుందని,తెలుగుదేశం పార్టీ హయాంలో సగం పూర్తిచేసిన ప్రాజెక్టులను ఇంకా ఈ ప్రభుత్వం పూర్తి చేయలేక పోయిందని గోరంట్ల అన్నారు.
నేడు రాయలసీమలో చంద్రబాబు నాయుడుకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని,అలాగే నారా లోకేష్ ఏ పడుతున్న యువగళం పాదయాత్రకు ప్రజల నుండి అనుహ్య స్పందన లభిస్తుందని,మహాశక్తి కార్యక్రమం రాష్ట్రంలో మహిళలందరినీ చైతన్య పరుస్తూ ముందుకు సాగిపోతుందని,ఇవన్నీ చూసి జగన్మోహన్ రెడ్డికి,వారి మంత్రులకు ఏమి చేయాలో తెలియక ఇలా దాడులకు పాల్పడుతున్నారని, దీనిపై గవర్నర్ కి కూడా ఫిర్యాదు చేస్తామని దాడికి పాల్పడిన వారిపై ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని పెద్దిరెడ్డి ఖబర్దార్ గుర్తుపెట్టుకో నీ పతనం మొదలైందని గోరంట్ల అన్నారు.
అంతేకాకుండా ఈ నెల 7 వ తారీకున చంద్రబాబు నాయుడు రాజమండ్రికి విచ్చేయుచున్నారని,ఇక్కడ నుండి వివిధ ప్రాజెక్టులను సందర్శించడానికి వెళ్తారని ఆయన అన్నారు.