Lanka govindarajulu aiyf

  • Home
  • Lanka govindarajulu aiyf

Lanka govindarajulu aiyf aiyf

09/12/2025
AIYF యువత - భవిష్యత్తు కెరీర్ గైడెన్స్ మ్యాగజైన్ ని ఏలూరు రేంజ్ IG జి.వి.జి అశోక్ కుమార్ IAS గారికి అందజేసిన AIYF రాష్ట్...
06/12/2025

AIYF యువత - భవిష్యత్తు కెరీర్ గైడెన్స్ మ్యాగజైన్ ని ఏలూరు రేంజ్ IG జి.వి.జి అశోక్ కుమార్ IAS గారికి అందజేసిన AIYF రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పరుచూరి రాజేంద్ర బాబు ,రాష్ట్ర ఉపాధ్యక్షులు లంకా గోవింద రాజులు

కారంపూడిలో విలేఖరి పై ఇద్దరు టిడిపి నాయకుల దాడి...!! # బహిరంగంగా పోలీస్ స్టేషన్ లోనే అందరిముందు కత్తి తో చంపుతామని బెదిర...
21/10/2025

కారంపూడిలో విలేఖరి పై ఇద్దరు టిడిపి నాయకుల దాడి...!!
# బహిరంగంగా పోలీస్ స్టేషన్ లోనే అందరిముందు కత్తి తో చంపుతామని బెదిరింపులు...!!

వార్త రాస్తే జర్నలిస్ట్ పై దాడి చేస్తారా.....!?

# అధికారం చేతిలో ఉందని అడ్డు ఆపు లేకుండా చేస్తున్న కొంతమంది కారంపూడి టిడిపి నాయకులు...!!

# వార్త రాసింది వైసీపీ నాయకుడికి చెందిన స్థలం గురించి....దాడి చేసింది టిడిపి నాయకులు...!!
# మరి ఈ బరితెగింపు ఎందుకు సంకేతం....!!

# గతంలో ఇదే నాయకులు వైసిపి ఆగడాలు అని గొంతు ఎత్తి అరిచి...ప్రస్తుతం వీరు చేస్తున్న ఆగడాలను ఏమి అనుకోవాలి....!!

ఆయనో వెటరన్ జర్నలిస్ట్, పేరు ఆలూరి లక్ష్మణరావు....వయసు 60 సంవత్సరాలు, కనీసం ఆయన వయసుకు కూడా గౌరవం ఇవ్వకుండా ఈ దాడి చేయడం గమనార్హం!!..నిజాన్ని నిర్భయంగా రాయడం ఆయనకు అలవాటు...అందుకని వీరు చేస్తున్న అక్రమ రేషన్ బియ్యం ఆగడాలని ప్రశ్నించినందుకు వేరే వైసీపీ నాయకుడి స్థలం గురించి వార్త రాస్తే ఈ రేషన్ బియ్యం అమ్ముకునే అధికార పార్టీ నాయకులు ఈయన పై దాడి చేయడం ఎంతవరకు సమంజసం అని ప్రజలు వీరి దౌర్జన్యాలపై ముక్కున వేలేసుకుంటున్నారు...!!

ఇప్పటికే కారంపూడి లో ఇలాంటి దౌర్జన్యాలు ఎన్ని జరిగినా పోలీసు శాఖ తీసుకున్న దాఖలాలు లేవని ఇప్పటికే ప్రజలు విమర్శిస్తున్నారు...!!

ఇప్పటికైనా ఇలాంటి ఎన్ని దాడులు జరిగినా...ఎలాంటి ఆగడాలు చేసినా చూస్తూ ఉరుకుంటారా...లేదా చర్యలు తీసుకుంటారా అన్నది వేచి చూడాలి...!!

13/09/2025
AIYF state press note మెడికల్ మాఫియా కు అడ్డుకట్ట వేయడంలో ప్రభుత్వం విఫలం. ఆపరేషన్ గరుడ కేవలం హడావుడి కే పరిమితమా...? ఏఐ...
12/04/2025

AIYF state press note

మెడికల్ మాఫియా కు అడ్డుకట్ట వేయడంలో ప్రభుత్వం విఫలం.

ఆపరేషన్ గరుడ కేవలం హడావుడి కే పరిమితమా...?

ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పరుచూరి రాజేంద్ర బాబు.

రాష్ట్రంలో మెడికల్ మాఫియా ఆగడాలు రోజురోజుకీ పెంచుమీరుతున్న చర్యలు తీసుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందిందని ఆపరేషన్ గరుడ పేరుతో అధికారులు హడావుడి చేయడం తప్ప నిషేధిత మందుల వ్యాపారస్తులపై చర్యలు తీసుకోవడంలో పూర్తిగా విఫలం చెందుతున్నారని అఖిల భారత యువజన సమాఖ్య ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పరుచూరి రాజేంద్ర బాబు విమర్శించారు.
శనివారం స్థానిక హనుమాన్ పేటలోని ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యాలయం నందు మీడియాతో మాట్లాడారు.
రాష్ట్రంలో నిషేదిత మందులు ఎవరు అమ్మిన చర్యలు తీసుకుంటామని, నిషేధిత మందుల నివారణకు మత్తు పదార్థాల నివారణకు ఆపరేషన్ గరుడా చేపడుతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిందని ఆపరేషన్ గరుడ పేరుతో రెండు రోజులపాటు రాష్ట్రంలో పలుచోట్ల మందుల షాపులను తనిఖీ చేసారని, కృష్ణాజిల్లా అవనిగడ్డ లో నిషేధిత మందులు విజయవాడ కేంద్రంగా సప్లై చేయబడ్డాయని ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన రాజకీయ నేత కొండపల్లి బుజ్జి ఏజెన్సీ ద్వారా నిషేధిత మందులు, అల్ట్రాసెట్, ట్రేమడాల్ లాంటి మందులు పట్టుబడ్డ ఇంతవరకు కేసులు నమోదు చేయకుండా హడావుడి చేశారు తప్ప ఎటువంటి చర్యలు చేపట్టలేదని విమర్శించారు.

డ్రగ్ రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను మారుస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గారు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు, రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత గారు ప్రకటనలు చేశారు తప్ప ఆచరణలో ఎటువంటి చర్యలు చేపట్టలేదని రాష్ట్ర రాజధాని కేంద్రమైన విజయవాడ నగరంలో విద్యాసంస్థలు, కోచింగ్ సెంటర్లు, అకాడమీలు, లలో గంజాయి విచ్చలవిడిగా దొరుకుతున్నటువంటి పరిస్థితులలో పెనమలూరులో ఉన్నటువంటి ఒక విద్యా సంస్థలో గంజాయి మత్తులో విద్యార్థి దూకి ఆత్మహత్య చేసుకున్నారని ఈ మధ్యకాలంలో ఆందోళన జరిగిన పట్టించుకోనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయని, ప్రజల ఆరోగ్యాన్ని యువత భవిష్యత్తును అధికారులు గాలికొదిలేసారని దుయ్యబట్టారు.
మరొక నెల రోజుల్లో విద్యా సంవత్సరం ప్రారంభమవుతుంది. కేవలం బ్యానర్ కట్టి, ఒక పోస్టర్ అతికించి మేమంతా చేశాము అంటే మత్తు పదార్థాల నివారణ జరగదని ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చే విధంగా చర్యలు చేపట్టాలని విజయవాడలో నిన్న ఒక మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ ఘటన జరిగితే, ఈరోజు గంజాయి పట్టుకోవడం జరిగిందని ఇంత బహిరంగంగా ఘటనలు జరుగుతున్న అధికారులు చర్యలు చేపట్టకపోవడం సరికాదని విమర్శించారు.
తక్షణమే రాష్ట్ర ముఖ్యమంత్రి, నారా చంద్రబాబు నాయుడు గారు జోక్యం చేసుకొని మెడికల్ మాఫియా ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ విజయవాడ నగర కార్యదర్శి లంకా గోవిందరాజులు, నగర సహాయ కార్యదర్శి సింగంశెట్టి మోహన్ ప్రసాద్, గాడి అజయ్ పాల్గొన్నారు.

ఎలా పాల లేకుండా విచ్చలవిడిగా అమ్ముతున్న బార్లు పై చర్యలు తీసుకోండి! ఏ ఐ వై ఎఫ్ నగర కార్యదర్శి లంకా గోవిందరాజులు  డిమాండ్...
11/04/2025

ఎలా పాల లేకుండా విచ్చలవిడిగా అమ్ముతున్న బార్లు పై చర్యలు తీసుకోండి! ఏ ఐ వై ఎఫ్ నగర కార్యదర్శి లంకా గోవిందరాజులు డిమాండ్ చేశారు!! ఈరోజు విజయవాడ మారుతి నగర్ లో ఉన్న ఎక్సైజ్ శాఖ జిల్లా కార్యాలయంలో ఇన్చార్జి సూపరిండెంట్ రంశివ గారికి కలిసి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ నగర్ కార్యదర్శి లంకా గోవిందరాజులు మాట్లాడుతూ
ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న బార్ల యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని కోరడం జరిగింది.ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా ముఖ్యంగా విజయవాడ నగరంలో సింగ్ నగర్, ప్రకాష్ నగర్, కండ్రిక, హనుమాన్ పేట, కృష్ణలంక, గాంధీనగర్, చలసాని నగర్, కబేలా, భవానిపురం, మిల్క్ ఫ్యాక్టరీ, చిట్టినగర్ ప్రాంతాలలో అనేక బార్లు రాష్ట్ర ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా రాత్రి మూడు గంటల వరకు తెల్లవారుజామున 5 గంటల నుండి అక్రమంగా మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా రోజువారీ కార్మికులు, రవాణా రంగానికి సంబంధించిన లారీ డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు ఎక్కువగా సంచరించే ప్రాంతాలలో మద్యం అమ్మకాలు బ్లాక్ లో నిర్వహిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టడమే కాకుండా ప్రజల ఆరోగ్యాన్ని హరింప చేయడంతో పాటు పలు ప్రమాదాలకు కేంద్రబిందువుగా మారుతున్నాయి.
ఇప్పటికే పలుమార్లు ఏఐవైఎఫ్ గా విజయవాడ నగరంలో ఉన్నటువంటి పలువురు అధికారులకు ఫిర్యాదు చేసిన స్పందించినటువంటి పరిస్థితులు., ఇబ్రహీంపట్నం, నందిగామ, తిరువూరు, మైలవరం, జగ్గయ్యపేట నియోజకవర్గాలలో రాష్ట్ర సరిహద్దు గ్రామాలలో బెల్టు షాపుల నిర్వహణ విపరీతంగా సాగుతున్నది. సమయంతో సంబంధం లేకుండా అక్రమ మద్యం అమ్మకాలు చేపట్టడం ద్వారా అనేక ప్రమాదాలతో పాటు గ్రామాలలో గొడవలు చోటు చేసుకున్న పరిస్థితులు నెలకొన్నాయి.తమరు చొరవ తీసుకొని బార్ల యజమానులతో సమావేశం నిర్వహించి ప్రభుత్వ నిబంధనల ప్రకారం అమ్మకాలు జరిగేలా చర్యలు చేపట్టాలని ప్రజల ఆరోగ్యాన్ని, ప్రాణాలను ,శాంతి భద్రతలను కాపాడాలని అఖిలభారత యువజన సమాఖ్య ఏఐవైఎఫ్ ఎన్టీఆర్ జిల్లా సమితి & విజయవాడ నగర సమితి గా కోరుచున్నాము. వినతి పత్రం ఇచ్చిన బృందంలో నాయకులు సింగంశెట్టి మోహన్ ప్రసాద్, ఐ ఆంజనేయులు, బర్రె రాజా, గంట మమత, నరేష్, షైనీ, తదితరులు పాల్గొన్నారు.

Address

30-2/1-7 Murthy Street, Karmikapuram

520002

Website

Alerts

Be the first to know and let us send you an email when Lanka govindarajulu aiyf posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

  • Want your business to be the top-listed Grocery Store?

Share