11/04/2025
ఎలా పాల లేకుండా విచ్చలవిడిగా అమ్ముతున్న బార్లు పై చర్యలు తీసుకోండి! ఏ ఐ వై ఎఫ్ నగర కార్యదర్శి లంకా గోవిందరాజులు డిమాండ్ చేశారు!! ఈరోజు విజయవాడ మారుతి నగర్ లో ఉన్న ఎక్సైజ్ శాఖ జిల్లా కార్యాలయంలో ఇన్చార్జి సూపరిండెంట్ రంశివ గారికి కలిసి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ నగర్ కార్యదర్శి లంకా గోవిందరాజులు మాట్లాడుతూ
ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న బార్ల యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని కోరడం జరిగింది.ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా ముఖ్యంగా విజయవాడ నగరంలో సింగ్ నగర్, ప్రకాష్ నగర్, కండ్రిక, హనుమాన్ పేట, కృష్ణలంక, గాంధీనగర్, చలసాని నగర్, కబేలా, భవానిపురం, మిల్క్ ఫ్యాక్టరీ, చిట్టినగర్ ప్రాంతాలలో అనేక బార్లు రాష్ట్ర ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా రాత్రి మూడు గంటల వరకు తెల్లవారుజామున 5 గంటల నుండి అక్రమంగా మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా రోజువారీ కార్మికులు, రవాణా రంగానికి సంబంధించిన లారీ డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు ఎక్కువగా సంచరించే ప్రాంతాలలో మద్యం అమ్మకాలు బ్లాక్ లో నిర్వహిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టడమే కాకుండా ప్రజల ఆరోగ్యాన్ని హరింప చేయడంతో పాటు పలు ప్రమాదాలకు కేంద్రబిందువుగా మారుతున్నాయి.
ఇప్పటికే పలుమార్లు ఏఐవైఎఫ్ గా విజయవాడ నగరంలో ఉన్నటువంటి పలువురు అధికారులకు ఫిర్యాదు చేసిన స్పందించినటువంటి పరిస్థితులు., ఇబ్రహీంపట్నం, నందిగామ, తిరువూరు, మైలవరం, జగ్గయ్యపేట నియోజకవర్గాలలో రాష్ట్ర సరిహద్దు గ్రామాలలో బెల్టు షాపుల నిర్వహణ విపరీతంగా సాగుతున్నది. సమయంతో సంబంధం లేకుండా అక్రమ మద్యం అమ్మకాలు చేపట్టడం ద్వారా అనేక ప్రమాదాలతో పాటు గ్రామాలలో గొడవలు చోటు చేసుకున్న పరిస్థితులు నెలకొన్నాయి.తమరు చొరవ తీసుకొని బార్ల యజమానులతో సమావేశం నిర్వహించి ప్రభుత్వ నిబంధనల ప్రకారం అమ్మకాలు జరిగేలా చర్యలు చేపట్టాలని ప్రజల ఆరోగ్యాన్ని, ప్రాణాలను ,శాంతి భద్రతలను కాపాడాలని అఖిలభారత యువజన సమాఖ్య ఏఐవైఎఫ్ ఎన్టీఆర్ జిల్లా సమితి & విజయవాడ నగర సమితి గా కోరుచున్నాము. వినతి పత్రం ఇచ్చిన బృందంలో నాయకులు సింగంశెట్టి మోహన్ ప్రసాద్, ఐ ఆంజనేయులు, బర్రె రాజా, గంట మమత, నరేష్, షైనీ, తదితరులు పాల్గొన్నారు.